Powered By Blogger

Saturday, 9 April 2022

ఊరంత వెన్నెల పాట లిరిక్స్

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

జగమంతా వేడుక
మనసంతా వేదన
పిలిచిందా నిన్నిలా
అడగని మలుపొకటి

మదికే, ముసుగే, తొడిగే అడుగే
ఎటుకో, నడకే, ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు

ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఎవరికీ, చెప్పవే, ఎవరిని అడగవే
మనసులో ప్రేమకే, మాటలే నేర్పవే
చూపుకందని మచ్చని కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో… రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ

ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

ఎవరితో పయనమో
ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్నికలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథని మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను

ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

 Share this song lyrics

వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!

కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా...