ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం, విధి లీలా
వెంట ఏ బంధమూ రక్తసంబంధము
తోడుగా రాదుగా తుదివేళా
మరణమనేది ఖాయమనీ… మిగిలెను కీర్తి ఖాయమనీ
నీ బరువూ… నీ పరువూ మోసేదీ ఈ ఈ ఈ
ఆ నలుగురూ ఆ నలుగురూ… ఆ నలుగురూ ఆ నలుగురూ
రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము
హద్దులే చెరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం
చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా కడకంటా నడిచేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
నలుగురూ మెచ్చినా… నలుగురూ తిట్టినా
విలువలే శిలువగా మోశావు
అందరూ సుఖపడే… సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు
నలుగురు నేడు పదుగురిగా… పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
పోయిరా నేస్తమా… పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావూ
ఆత్మయే నిత్యమూ… జీవితం సత్యమూ
చేతలే నిలుచురా చిరకాలం
బతికిననాడు బాసటగా… పోయిననాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
No comments:
Post a Comment