Powered By Blogger

Sunday, 17 April 2022

jamurathiri jabilamma song lyrics

 


 

జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కల
వయ్యారి వాలు కళ్ళలోన
వరాల విండి పూల వాన
స్వరాల ఊయలూగువేళ
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా


కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అని స్నేహం పిలవగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని

జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

జామురాతిరి
జాబిలమ్మ జోల పాడనా ఇలా

జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కల
వయ్యారి వాలు కళ్ళలోన
మ్మ్..మ్మ్..హాహ
స్వరాల ఊయలూగువేళ

హాహ హాహ హా తాననాన మ్మ్ మ్మ్ హహా

తాన తనననా తానినన మ్మ్ మ్మ్ హాహ..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ...హాహ..

No comments:

Post a Comment

వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!

కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా...