శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా...
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా...
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా..
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా..
మదన మోహిని చూపులోన మాండు రాగమేల..
మదన మోహిని చూపులోన మాండు రాగమేల..
పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టిన ఇల్లే
శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా..
నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా..
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా..
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే
నవమదనా నవమదనా కలపకు కన్నుల
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా..
Movie : Iddaru
Lyrics : Veturi
Music : A R Rahman
Singers : Unni Krishnan, Bombay Jayashre